Prostitution: స్పా ముసుగులో వ్యభిచారం.. డాక్టర్ కాలేక ఈ పని..!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. 10 మంది మహిళలను రక్షించారు. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది కస్టమర్లు కూడా పట్టుబడ్డారు. ఒక పీఓఎస్ మిషన్, రూ.33 వేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఓ అపార్ట్ మెంట్ ను ఓ మహిళ అద్దెకు తీసుకుంది.
అపార్ట్ మెంట్ ముందు పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్ అనే బోర్డు పెట్టారు. స్పా సెంటర్ అని చెప్పి రాయల శృతి, రమణ, జాహెద్ ముగ్గురు కలిసి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక్కడ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలోని బృందం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న 'పర్పుల్ నేషనల్ హెల్త్' అనే మసాజ్ సెంటర్‌పై దాడి చేసింది.

వ్యభిచార కూపం నుంచి బయటపడిన మహిళలు ఢిల్లీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని, రక్షించిన మహిళలను తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.శృతి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.
యువతులను పోలీసులు రెస్క్యూ హోమ్ కు తరలించారు. శృతి పోలీసుల విచాణలో కీలక విషయాలు చెప్పింది. తాను డాక్టర్ కావాలనుకున్నట్లు చెప్పింది. కానీ తమది పేద కుటుంబమని అయినా కూడా ఉక్రెయిన్ లో మెడిసిన్ చేసేందుకు వెళ్లినట్లు పేర్కొంది. రెండో సంవత్సరం ఫీజు చెల్లించలేక తిరిగి స్వదేశానికి వచ్చినట్లు చెప్పింది. డబ్బుల కోసం వ్యభిచారం పని చేయిస్తున్నట్లు ఒప్పుకుంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications