Hyderabad: హైదరాబాద్ లో జోరందుకున్న ఇళ్ల విక్రయాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త నెమ్మదించిన రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇది ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇందుకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని నివేదికలో పేర్కొంది.
అత్యధిక విక్రయాల పరిమాణం, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలలో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ముంబై ఉంది. 2024 మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో 9,550 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 15% పెరిగింది. 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి.

వీటి మొత్తం విలువ రూ. 16,190 కోట్లు అని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి రూ. 1 కోటి.. అంతకంటే ఎక్కువ ధర కలిగిన గృహాల విక్రయాలు 92 శాతం పెరిగినట్లు నివేదిక వివరించింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ధర కలిగిన మిడ్-సెగ్మెంట్ గృహాల విక్రయాలు 47 శాతం పెరిగాయని తెలిపింది.
హైదరాబాద్‌లో ధరలు 13 శాతం పెరిగినట్లు పేర్కొంది. చాలా మంది ప్రీమియం హౌస్ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపతున్నట్లు నివేదికన బట్టి తెలుస్తోంది. ఏప్రిల్ 2024లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు 6,578 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గతం కంటే 46 శాతం ఎక్కువ. ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్ లోనే కాకుండా మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications