Khairathabad Ganesh: వినాయక చవితికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు.. తుది దశకు చేరిన పనులు..
వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ బడ గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది. నవరాత్రుల్లో ఈ గణపతిని వేల మంది దర్శించుకుంటారు. ఈ తొమ్మిది రోజులు హైదరాబాద్ ఖైరతాబాద్ లంబోదరుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. ఈ సారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు శ్రీదశ మహా విద్యా గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే విగ్రహ తయారీ పూర్తయిందని.. సెప్టెంబర్ 18 వినాయక చవితి రోజున పూజలు ప్రారంభిస్తామని నిర్వహకులు తెలిపారు.
ఈసారి ఖైరతాబాద్ గణేషుడు 63 ఎత్తులో రూపుదిద్దుకున్నారు. గతేడాది 58 ఎత్తులో గణనాథుడు దర్శనమిచ్చాడు. ఈసారి పర్యవరణాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితో విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. ప్రస్తుతం గణనాథుడిని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. కాగా ఖైరతాబాద్ లో ఎప్పటి నుంచి లంబోదరుడి విగ్రహం ప్రతిష్టిస్తూ వస్తున్నారు. గత 69 ఏళ్లుగా ఖైరతాబాద్ లో వినాయక విగ్రహం పెడుతూ వస్తున్నారు. వచ్చే ఇది 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది.

నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ప్రతి షిఫ్ట్ లో పోలీసులతో పాటు 200 మంది వాలంటీర్లు ఉండనున్నారు. ఇక్కడ రెండు నెలలు ముందుగానే విగ్రహ తయారి ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు గణేషుడి తయారిలో పాలుపంచుకుంటారు. ఈ సారి విగ్రహాన్ని హైదరాబాద్ కు చెందిన సి రాజేంద్ర, నమూనా ఫ్రింట్ పనులను నల్లవాగుల శరత్ చేశారు. ఈయన గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్నారు.
ఖైరతాబాద్ నవరాత్రుల దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడపనున్నట్లు ప్రకటించింది. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునే భక్తుల కోసం మెట్రో రైలు సర్వీస్ సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామని చెప్పారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని అన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications