Rains: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో 3 గంటల్లో భారీ వర్షం..!
వాతావరణ శాఖ హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. భాగ్యనగరంలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. అటు జీహెచ్ఎంసీ కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మ్యాన్‌హోల్స్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో40 కిలోమీటర్ల వేగంతో వచ్చే వర్షాలు, గాలులు మరో 5 రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్ లోనూ రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై.. ఒకటి లేదా రెండు సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే పరిస్థితి మే 4,5వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 6వ తేదీన, సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 23, 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. లంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల వడగళ్ల వానలు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం హైదరాబాద్‌లోని బండ్లగూడలో అత్యధికంగా 29.3 మి.మీ వర్షపాతం నమోదయింది.
వర్షాల కారణంగా మే 5, 2023 వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని IMD హైదరాబాద్ సూచించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయాడు. వర్షంతో నీటి గుంత నిండగా.. మంగళవారం ఉదయం బాలుడు అందులో పడి మరణించాడు.












Click it and Unblock the Notifications