ఇంట్లో ముగ్గురు మహిళలు.. అర్ధరాత్రి దొంగలు చొరబడి బీభత్సం..
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళలు ఉన్న ఇంట్లోకి చొరబడి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అయితే ఆ మహిళలు దొంగలను తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ దొంగ 55 ఏళ్ల ఓ మహిళపై సుత్తితో దాడి చేయగా.. ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆపై దొంగలు అక్కడినుంచి పరారయ్యారు.

Recommended Video

Lovers In Hyderabad Fear Of Bajrang Dal | భజరంగ్ దళ్ కి భయపడే..!!| Oneindia Telugu
జరిగిన ఘటనపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మహిళల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరపనున్నారు. ఇది నిజంగా దోపిడీ దొంగల పనేనా లేక మహిళలు ఒంటరిగా ఉన్నారని ఎవరైనా ఆకతాయిలు ఇంట్లోకి చొరబడ్డారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications