థర్డ్ వేవ్‌కు ఎండ్ కార్డు.. ఆఫీసులు తెరవచ్చు: డీహెచ్
కరోనా థర్డ్ వేవ్ గురించి తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పూర్తిగా ముగిసిందన్నారు. థర్డ్ వేవ్ ప్రారంభనప్పటి నుంచి అన్నీ చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయని వివరించారు. అయితే పూర్తిగా కనుమరుగు కాలేదని చెప్పారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
టీకా తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా కొత్త వేరియంట్లు పుట్టకుండా వ్యాక్సిన్ల వల్ల కట్టడి చేయొచ్చని చెప్పారు. తెలంగాణలో ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని అన్నారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలిస్తున్నామని చెప్పారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంతలోనే డీహెచ్ కీలక ప్రకటన చేశారు. దీంతో మరింత ఆశాజనకంగా పరిస్థితి మారింది.












Click it and Unblock the Notifications