Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ముగ్గురిది క్రూర మనస్తత్వం, వారిది ఓకే ఊరు, నవీన్ చేతిలో ఫోన్, స్క్రిన్ మీద బ్లూ ఫిల్మ్..

వెటర్నరీ డాక్టర్ లైంగికదాడి, హత్య కేసు నిందితుల గురించి విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసులో ఏ1 నిందితుడు మహ్మద్ అలియాస్ ఆరిఫ్ కన్నా మిగతా ముగ్గురు క్రూర మనస్తత్వం కలిగి ఉన్నవారని తెలుస్తోంది. అందుకోసమే మహ్మద్‌తో చేతులు కలిపి.. అతనికే సలహాలు ఇచ్చి వైద్యురాలిని దారుణంగా హతమార్చారు.

నలుగురిది ఓకే మండలం..

నలుగురిది ఓకే మండలం..

మహ్మద్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ కాగా.. అదే మండలంలోని గుడిగండ్ల మరో ముగ్గురి సొంత గ్రామం. జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు గుడిగండ్లకు చెందినవారు. వీరి వయస్సు 20 ఏళ్లు కాగా.. ఆవారాగా తిరుగుతారని స్థానికులు చెప్తున్నారు. ఇందులో నవీన్‌ది క్రూర మనస్తత్వం అని గ్రామస్తులు తెలిపారు.

ఫోన్‌లో బ్లూ ఫిల్మ్..

ఫోన్‌లో బ్లూ ఫిల్మ్..

అతను ఎప్పుడు ఫోన్ పట్టుకుంటారని గ్రామస్తులు చెప్తున్నారు. ఫోన్‌లో ఎప్పుడూ బ్లూ ఫిల్మ్ చూసేవాడని పేర్కొన్నారు. అలా చూసి సైకోగా తయారడయ్యారని తెలిపారు. ఆ ముగ్గురికి భయం లేకపోవడంతో దారుణానికి ఒడిగట్టారని వెల్లడించారు. అంతేకాదు వెటర్నరీ డాక్టర్ తన వాహనం లారీ పక్కన పార్క్ చేసి వెళ్లిపోగా.. టైర్ పంక్చర్ చేద్దామని ఐడియా ఇచ్చింది కూడా నవీనే. చెప్పినట్టు టైర్ పంక్చర్ చేసి ప్రియాంక ఆగేందుకు కారణమయ్యాడు. అక్కడున్న మరో ముగ్గురికి రానీ చావు తెలివితేటలు నవీన్‌కే వచ్చాయంటే.. వాడు ఎంత క్రూరుడో అర్థం చేసుకోవచ్చు.

చిత్రంగా..

చిత్రంగా..

వీరిలో మరొకడు చింతకుంట చిన్నకేశవులు. నవీన్, శివతో తిరుగుతున్నాడో ఏమో కానీ.. ఇతను కూడా నేర స్వభావం కలిగి ఉన్నాడు. చెన్నకేశవులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అతని భార్య ప్రస్తుతం గర్భవిత కూడా. వైద్యురాలి ఘటనపై ఆమె కూడా స్పందించింది. తన భర్త తప్పు చేస్తే శిక్షించాలని ఆ గర్భవతి కోరింది.

ఉరితీయండి

ఉరితీయండి

మరోవైపు నిన్న చెన్నకేశవులు తల్లి కూడా స్పందించారు. తన కుమారుడిని ఉరితీయాలని పేర్కొన్నారు. తనకు ఆడపిల్లలు ఉన్నారని.. ప్రియాంక కూడా తన కూతురు లాంటిదనే చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని.. కఠినంగా శిక్షించాలని కోరారు. ఉరితీయాలని ఆమె పేర్కొనడంతో.. ఇలాంటి తల్లి కడుపున నీచుడు ఎలా పుట్టాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+