మూడు రోజుల్లో వానలు.. ఉరుములు, మెరుపులు, ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళా ఖతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఇది మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు వ్యాపించి ఉంది. రేపు ఉదయంకి అదే ప్రదేశంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది ఉత్తర - వాయువ్య దిశగా కదిలి బలపడి మే 24 నాటికి తుఫానుగా మరియు తరువాత 24 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారుతుంది.

ఉత్తర - వాయువ్య దిశగా కదులుతూ.. మరింత బలపడి, పశ్చిమ బెంగాల్ సమీపంలోని ఉత్తర బంగాళాఖాతానికి మరియు ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు 26వ తేదీ ఉదయం చేరుకుంటుంది. ఇది 2021 మే 26 సాయంత్రానికి పశ్చిమ బెంగాల్ మరియు దాని ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో.. రేపు ఎల్లుండి ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉంది.

three days rain in telangana state

ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులుతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణ తెలంగాణ జిల్లాలలో.. రేపు ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో గల కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉంది.

Recommended Video

    Cyclone Tauktae : PM Modi Conducts Aerial Survey Of Affected Areas Of Gujarat || Oneindia Telugu

    గత కొద్దీరోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరోవైపు కరోనా కేసులు వాతావరణం చల్లబడిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. గతేడాది వేసవిలో కేసులు ఎక్కువ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా సమ్మర్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+