Hyderabad: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి..!
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయలు మృతి చెందారు. టెక్సాస్‌లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వైట్ స్ట్రీట్‌ను దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు కొలిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. ఒకరు చెన్నైకి చెంది వారిగా గుర్తించారు.
ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27),ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉండగా.. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు. వీరంతా కలిసి బెంటన్‌విల్లేకు వెళ్లేందుకు కార్‌పూలింగ్ యాప్ ద్వారా కలిశారు.

బెంటన్‌విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి డల్లాస్‌లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. లోకేశ్ పాలచర్ల తన భార్య వద్దకు బెంటన్‌విల్లేకు వెళ్లారు. ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన దర్శిని వాసుదేవన్, బెంటన్‌విల్లేలోని తన మామను చూడటానికి వెళుతున్నారు. ఈ బృందం కార్‌పూలింగ్ యాప్‌ని ఉపయోగించి ఒకే కారులో ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది.
ఆర్యన్ తండ్రి సుభాష్ చంద్రారెడ్డికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మ్యాక్స్ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. రాయచోటికి చెందిన ఈ కుటుంబం హైదరాబాద్‌లోని నిజాంపేటలో స్థిరపడింది. ఆర్యన్ కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. దర్శిని టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో నివసిస్తున్నప్పుడు ఫరూక్ కూడా బెంటన్‌విల్లేలో నివసిస్తున్నారు. మృతులు ప్రయాణిస్తున్న SUVని వేగాన్ని కంట్రోల్ చేయలేక ముందున్న ట్రక్కు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
కార్‌పూలింగ్ ఒకే ఊరు వెళ్లవారు కలిసి ఒకే కారులో వెళ్లడం. ఇలా చేయడం వల్ల ఛార్జ్ తగ్గుతుంది. ఉదాహరణకు రాజు, శివ, సాయి ఉన్నారు. వీరికి పరిచయం లేదు. కానీ వీరంతా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లాలి. రాజు కారు బుక్ చేసుకున్నాడు.. అయితే శివ, సాయి కూడా కరీంనగర్ వెళ్తుండడంతో వారు కూడా రాజుతో కలిసి ప్రయాణించడానికి సిద్ధమై.. అదే కారులో బయల్దేరారు. దీన్నే కార్ పూలింగ్ అంటారు. ఇంకా క్లియర్ చెప్పుకోవాంటే.. షేర్ ఆటో టైప్ అన్నమాట. కార్ పూలింగ్ ఫారిన్ కంట్రీల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications