బెల్టు, బూట్లు.. ఒళ్లంతా బంగారమే..! శంషాబాద్‌లో 3కిలోలకు పైగా గోల్డ్ సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కిలోలకొద్దీ బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు అడ్డదారిలో గోల్డ్ తీసుకొస్తున్నారు. అదే క్రమంలో ఆదివారం నాడు సింగపూర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి మూడు కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింగపూర్ నుంచి విమానం ల్యాండ్ కాగానే తనిఖీలకు సిద్ధమయ్యారు. అయితే చౌటుపల్లి సురేశ్ అనే వ్యక్తి వారిని చూసి కంగారుపడ్డాడు. దాంతో నడకలో వేగం పెంచి అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేశాడు. ఆయన తీరు చూసి వారికి అనుమానం రావడంతో చుట్టుముట్టారు.
సురేశ్ సింగపూర్ నుంచి వస్తూ 3 కిలోల 300 గ్రాముల బంగారం అడ్డదారిలో తీసుకొచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొంగ బంగారం గుట్టురట్టైంది. ఓ క్లాత్ లో బంగారు బిస్కెట్లను పేర్చి దాన్ని బెల్టులా తయారుచేసి నడుముకు కట్టుకున్నాడు. అంతేకాదు బూట్లల్లో కూడా బంగారు బిస్కెట్లు బయటపడటం గమనార్హం. సురేశ్ నుంచి స్వాధీనం చేసుకున్న వీటి ఖరీదు దాదాపు కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications