ఏడాదిగా సహజీవనం.. మోజు తీరాక కాదన్నాడు.. ఇదీ టిక్కుటాక్కు ప్రేమాయణం

హైదరాబాద్ : టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ క్రేజీగా ఫీలవుతున్నారు కొందరు. ఆ క్రమంలో వీడియోలకు లైకులు రావడంతో పాటు కొన్ని సందర్బాల్లో పరిచయాలకు దారి తీస్తోంది వ్యవహారం. అలా హైదరాబాద్‌లో టిక్‌టాక్ పరిచయం కాస్తా పోలీస్ స్టేషన్‌ వరకు చేరింది.

హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలోని వినాయక్ నగర్‌కు చెందిన 30 ఏళ్ల హేమలత రెడ్డికి వివాహామై ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్ని కారణాలతో భర్తతో విభేదించి డైవోర్స్ తీసుకున్నారు. అనంతరం జీవనోపాధి నిమిత్తం చిన్న చిన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో బేగం బజార్ ఏరియాకు చెందిన 23 సంవత్సరాల మిశాల్ జైన్‌తో టిక్‌టాక్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే తరచుగా ఛాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం స్ట్రాంగైంది.

tiktok love episode went to police station in hyderabad

ఆ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని దాదాపు 10 నెలల నుంచి సహజీవనం చేస్తున్నాడు. అంతేకాదు వివిధ ప్రాంతాలకు తిప్పుతూ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. పబ్బులంటూ, రిసార్టులంటూ బాగానే తిప్పాడు. చివరకు గోవా, మాల్దీవులు లాంటి ప్రదేశాలకు సైతం తీసుకెళ్లాడు. అయితే పెళ్లి మాట ఎత్తేసరికి ప్లేటు ఫిరాయించాడు. మ్యారేజ్ చేసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టడంతో రివర్సయ్యాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరించాడు.

పెళ్లి పేరుతో సహజీవనం చేయడమే గాకుండా ఇప్పుడేమో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ హేమలత రెడ్డి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయని.. దాంతో తామిద్దరం సహజీవనం చేస్తున్న ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన కంప్లైంట్ చేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+