హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఆర్ఎస్ ఎంపీకి బండ్ల గణేష్ పాదాభివందనం: దేవుడంటూ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా మంచి పేరుతెచ్చుకున్న బండ్ల గణేష్.. తన ప్రసంగాలు, ప్రవర్తనతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా చేసిన ప్రసంగాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లోనూ రాణించాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన పాలిటిక్స్ కు దూరంగానే ఉంటున్నారు.

రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కిన బండ్ల గణేష్

రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కిన బండ్ల గణేష్

అయితే, తాజాగా, బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు బండ్ల గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనని చెప్పుకున్న బండ్ల గణేష్.. రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానంటూ ప్రకటించారు. రంజిత్ రెడ్డి లేకుండా తాను ఆత్మహత్య చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రంజిత్ రెడ్డి తనకు దేవుడన్న బండ్ల గణేష్

రంజిత్ రెడ్డి తనకు దేవుడన్న బండ్ల గణేష్

గురువారంనాడు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి పాదాలను తాకి నమస్కరించారు బండ్ల గణేష్. రంజిత్ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని.. రంజిత్ అన్న దేవుడితో సమానం. నేను ఏ పార్టీలో లేను. కానీ, రంజిత్ రెడ్డి అన్న వెనుక ఉన్నాను అని బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలకు దూరంగా బండ్ల గణేష్, కానీ..

కాగా, నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అయితే, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో బండ్ల గణేష్.. రాజకీయాలకు క్రమంగా బండ్ల గణేష్ దూరమయ్యారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. పొలిటికల్ లీడర్లతో మాత్రం మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు బండ్ల గణేష్.

English summary
tollywood producer bandla ganesh praises brs mp ranjith reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X