అర్ధరాత్రి పబ్‌లో..మద్యం మత్తులో..బీరు సీసాలతో ఘర్షణ: రాహుల్ సిప్లిగంజ్‌కు గాయాలు..!
హైదరాబాద్: రాహుల్ సిప్లిగంజ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తనదంటూ ఓ ట్రెండ్‌ను సృష్టించిన హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు. బిగ్‌బాస్ సీజన్-3 విజేతగా తెలుగువారిని ఆకట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో బీరు సీసాలతో గాయపరిచారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పబ్‌లో ఘర్షణ..
జూబ్లీహిల్స్‌లోని ఓ టాప్ పబ్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పబ్ టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖుడిదిగా చెబుతున్నారు. తన స్నేహితురాలితో కలిసి రాహుల్ సిప్లిగంజ్.. రాత్రి 11:30 గంటల సమయంలో పబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి కొందరు గుర్తు తెలియని యువకులు ఆయన స్నేహితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నారు. ఈ యువకుల్లో తాండూరు ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నారని తెలుస్తోంది.

బూతులు తిట్టడంతో..
ఆ యువకులను వారించడానికి సిప్లిగంజ్ ప్రయత్నించాడు. దీనితో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ యువకులు రాహుల్ సిప్లిగంజ్‌ను బూతులు తిట్టారని, అసభ్య పదజాలంతో దూషించారని సమాచారం. దీనితో రాహుల్ వారితో ఘర్షణకు దిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమతో పాటు పబ్‌లో ఉన్న వారు వారించడానికి ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. రాహుల్‌పై భౌతిక దాడికి దిగారు. తమ చేతుల్లో ఉన్న బీరు సీసాలతో అతని తలపై బలంగా కొట్టారు.
సీసీటీవీ పరిశీలన..
ఈ ఘటనతో రాహుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతణ్ని గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌కు చేరుకుని సీసీటీవీలను పరిశీలించారు. ఈ దాడి ఘటనపై పబ్‌లో ఉన్న వారు చిత్రీకరించిన కొన్ని వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసిన వారిలో తాండూరు ఎమ్మెల్యే సోదరుడు ఉన్నారని చెబుతున్నారు.
Recommended Video


మూవీ సెట్స్‌పై ఉండగా..
ప్లే బ్యాక్ సింగర్‌గా ఆలరిస్తూ వస్తోన్న రాహుల్.. ప్రస్తుతం నటుడిగా కూడా మారిపోయారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తోన్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందట. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది. సాధారణంగా రాహుల్ సిప్లిగంజ్ గొడవలు, ఘర్షణల జోలికి వెళ్లడని, కలుపుగోలుగా వెళ్లే మనస్తత్వం ఉన్నవాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications