Hyderabad: నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు..
హైదరాబాద్ లోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి శనివారం 9 గంటల వరకు చేప మందు పంపిణీ చేస్తుండడంతో ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షాలు రెండు రోజుల పాటు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షాలు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షాలు విధిస్తున్నామని సిటీ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లించున్నట్లు చెప్పారు. అసెంబ్లీ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వాహనాలను బషీర్ బాగ్ ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుక మళ్లించనున్నారు. ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనాలను అబిడ్స్ జీపీవో వైపు పంపనున్నారు. బేగంబజార్ ఛత్రి, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను దారుసలాం, ఏక్ మినార్ వైపు దారి మళ్లించనున్నారు.

చేప మందు కోసం వచ్చే వారి వాహనాల పార్కింగ్ కు కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. వాహనాలను నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్, ఎంఏఎం జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద పార్కింగ్ చేసుకోవచ్చని చెప్పారు. బస్సులు, వ్యాన్లను గోషామహల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలని చెప్పారు. మరోవైపు చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అస్తమా బాధితులతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చిన వారికి ఆహారం, మంచి నీటి సరఫరాను పలు స్వచ్ఛంద సంస్థలు చూసుకుంటున్నాయి. ఇప్పటికే జనాలు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. రేపు ఉదయానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications