Hyderabad News: ఐటీ కారిడర్‍లో 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..
ఐటీ కారిడార్‌లో నేటి నుంచి మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. నానక్‌రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సత్వ నాలెడ్జ్ క్యాపిటల్‌లో నిర్మాణ పనుల కారణంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వెహికల్స్ దారి మళ్లిస్తారని చెప్పారు. వెస్ట్ బిల్డింగ్ నుంచి హయత్ హైదరాబాద్ వైపు వచ్చే వెహికల్స్ వేవ్ రాక్ జంక్షన్ మీదుగా, ఐసీసీఐ బ్యాంక్ జంక్షన్ నుంచి వెస్ట్ బిల్డింగ్ సర్వీస్ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ హయత్ హైదరాబాద్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

జూబ్లీహిల్స్
మరో వైపు జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ ను దారి మళ్లింపు కొనసాగుతోంది. గురువారం వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇలా ట్రాఫిక్ సమస్య తగ్గితే దీన్ని కొనసాగిస్తామని.. లేకుంటే మార్పులు చేస్తామన్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నం.45, జర్నలిస్టు కాలనీ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వాహనాలను దారి మళ్లీస్తున్నట్లు వివరించారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు రోడ్ నం.45 మీదుగా వెళ్లేలేరు. మీరు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్లాలంటే జగన్నాథ టెంపుల్ సర్కిల్ వద్ద రైట్ తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, కేబీఆర్ పార్కు చెక్ పోస్టుకు వెళ్లాలి. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్36 మీదుగా మెట్రో పిల్లర్ నం. 1650, రోడ్ నెంబర్ 54 మీదుగా మళ్లిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జి
ఫిల్మ్ నగర్ నుంచి చెక్ పోస్టుకు వెళ్లే వాహనదారులు రోడ్ నెంబర్ 45 వద్ద లెఫ్ట్ తీసుకుని హార్ట్ కప్ కేఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని చెక్ పోస్టుకు వెళ్లొచ్చు. కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్లాలంటే రోడ్ నెంబర్ 45 నుంచి కాకుండా రోడ్ నెంబర్ 54 లో లెఫ్ట్ తీసుకుని రోడ్ నెంబర్ 36 ఫ్రీడమ్ పార్క్ నుంచి మెట్రో పిల్లర్ నం. 1663 వద్ద యూటర్న్ తీసుకొని చెక్ పోస్టుకు చేరుకోవచ్చు. ఫిల్మ్ నగర్ నుంచి ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నం.12 వైపు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుని ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

గీతా ఆర్ట్స్ ఆఫీస్
కేబుల్ బ్రిడ్జి నుంచి బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ, ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లేవారు రోడ్ నెంబర్45లోని హార్ట్ కప్ కేఫ్ వద్ద యూ టర్న్ తీసుకుని.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి రోడ్ నెంబర్.51, పక్షి సర్కిల్, న్యాయవిహార్ నుంచి ఎడమ వైపునకు వెళ్లి ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లొచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్12, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్45 మీదుగా కాకుండా ఫిల్మ్ నగర్ రోడ్ ఎడమవైపునకు వెళ్లి భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్ తీసుకొని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు నుంచి జర్నలిస్ట్ కాలనీ/రోడ్ నం. 45 వెళ్లాల్సి ఉంటుంది.

సీతాఫల్ మండి
సీతాఫల్మండి రోడ్లో సీవరేజీ పనులు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి డిసెంబరు11 వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుందని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాటర్ సప్లయ్ సీవరేజీ పనులతో దాదాపు 12 రోజుల పాటు ఈ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నట్లు వివరించారు. చిలకలగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనదారులు ఆలుగడ్డ బావి మీదుగా మెట్రో పిల్లర్ 1139 వద్ద యూటర్న్ తీసుకుని రైల్వే క్వార్టర్స్ మీదుగా సీతాఫల్మండి వైపు వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications