రాష్ట్రంలో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌కు పీఎంఈజీపీ రుణం మంజూరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీఎంఈజీపీ పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం ఓ ట్రాన్స్‌జెండర్ సబ్సిడీ రుణం పొందారు. కరీంనగర్‌కు చెందిన ఆశా ఫొటో స్టూడియో కోసం ఈ లోన్ తీసుకున్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ పథకం కింద రుణం మంజూరు చేసినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ శాఖ ద్వారా ఈ లోన్ మంజూరు చేసినట్లు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శాస్త్రినగర్ కు చెందిన ఆశా కరీంనగర్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఫొటోగ్రఫీపై మక్కువతో ఆమె ఫొటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుంది. 2017 నుంచి ఆదర్శనగర్‌లో ఫొటో స్టూడియోను నడుపుతోంది. ఫొటోగ్రఫీతోనే జీవనోపాధి పొందాలని ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు ఆశా తెలిపారు. బర్త్ డే ఫంక్షన్లు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లను, ఇతర ఫంక్షన్లను ఆమె కవర్ చేస్తోంది. ఆర్థిక సమస్యలు ఏర్పడటం, స్టూడియోను మరింత మెరుగుదిద్దడం కోసం పీఎంఈజీపీ కింద ఆమె రుణం తీసుకుంది.
ఇది ఇలావుండగా, మరో ట్రాన్స్‌జెండర్ నక్క సింధుకు కూడా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, జిల్లా లేటెస్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్బీఐ ఏజీఎం శేఖర్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పీడీ మెప్మా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications