Hyderabad: ఆ వైపు వెళ్తున్నారా.. అయితే 90 రోజుల పాటు తిరిగి వెళ్లాల్సిందే..!
హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలైన అమీర్ పేట్, ఎస్సార్ నగర్ నుంచి.. మూసాపేట, కూకట్ పల్లి వైపు వెళ్లాలంటే తిరిగి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. ఇక్కడ మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షాలు అమలులో ఉంటాయి. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కంప్లెక్స్ వరకు నాలా పునర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28 నుంచి అంటే నుంచి జూలై 28 వరకు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయి.
మంగళవారం నుంచి 90 రోజుల పాటు ఇటు వైపు నుంచి కూకట్ పల్లి, మూసాపేట వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందే. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. కూకట్ పల్లి నుంచి అమీర్ పేట వచ్చే వాహనదారులు కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని ఐడిఎల్ చెరువు రోడ్డు వైపు వెళ్లాలి. అక్కడి నుంచి గ్రీన్ హిల్స్ రోడ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్, యూసఫ్ గూడ నుంచి అమీర్ పేట చేరుకోవచ్చు.

మూసాపేట నుంచి అమీర్ పేట కు రావాలనుకునే వారు ఐడీఎల్ చెరువు రోడ్డు, గ్రీన్ హిల్స్ రోడ్డు, రెయన్ బో విస్టాస్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్వత్ నగర్ కావూరి హిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, యూసఫ్ గూడ నుంచి వెళ్లాలి. కూకట్ పల్లి నుంచి బేగం పేట వెళ్ల వారు కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి బాలానగర్ ఫ్లైఓవర్ మీదుగు న్యూబోయిన్ పల్లి, తాడ్ బండ్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి బేగంపేటకు వెళ్లొచ్చు. బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు బాలానగర్ ఫ్లైఓవర్ మీదుగా న్యూ బోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్ ,ప్యారడైజ్ జంక్షన్ , బేగంపేట్ ఫ్లై ఓవర్ నుంచి అమీర్‌పేటకు వెళ్లొచ్చు.












Click it and Unblock the Notifications