హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగింది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కన్ఫ్యూజ్ చేయడం.. కన్ఫ్యూజ్ కావడం మానవ తప్పిదాల్లో సర్వసాధారణం, చాలా సహజం. మనుషులే తప్పులు చేస్తుంటే ఇక మానవ నిర్మిత సాధనాలు ఇంకెన్ని తప్పులు చేస్తుండాలి. అందుకే ట్రాఫిక్ కెమెరాలు క్లిక్‌మనిపించిన ఫోటో తప్పిదానికి దారితీసింది. ట్రిపుల్ రైడింగ్ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడికి చలానా పంపించడంతో అతడు అవాక్కయాడు.

సాధారణంగా చలాన్లు వేసేటప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. దాన్నిబట్టి వాహనదారులు తామకు ఎందుకు చలానా వేశారో ఆ ఫోటో చూసి నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ అందులో ఏవైనా తప్పులుంటే ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఆ క్రమంలో ట్రిపుల్ రైడింగ్ పేరిట తనకు చలానా వచ్చిన వాహనదారుడు వారిని ఆశ్రయించాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న మొదటి వ్యక్తి తలకాయ ఇతర వాహనదారుడికి సంబంధించింది. క్లోజప్ షాట్‌లో ఆ రెండు వాహనాలు మిక్సయిపోయి అలా కనిపించిందన్నమాట.

triple riding challan but its not bike rider complaint to officials

పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!

అయితే ట్రిపుల్ రైడింగ్ చేయకున్నా తనకు చలానా వేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించాడు సదరు వ్యక్తి. దాంతో మొదట నాలుక కరుచుకున్న ట్రాఫికోళ్లు.. ఆ వాహనదారుడికి మరో దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. సరే ఆ విషయం వదిలేద్దాం కానీ నీకు మరో చలానా వేస్తున్నామంటూ కంగుతినిపించారు. ఆన్‌లైన్‌లో అతడు ఫిర్యాదు చేయడంతో.. మీ అభ్యర్థనను స్వీకరించాం, మీ చలానాను ట్రిపుల్ రైడింగ్ కేటగిరీ నుంచి హెల్మెట్ పెట్టుకోలేదనే కేటగిరీకి మార్చుతున్నట్లు సమాధానమిచ్చారు. దాంతో అటు పోయి ఇటు పోయి మళ్లీ తన మీదకే వచ్చిందంటూ ఎంత ఫీలయ్యాడో పాపం సదరు వాహనదారుడు.

English summary
Hyderabad Traffic Police made a mistake that sent triple riding challan for not that. The Bike Rider shocked while saw related photo and sent a request to officials. The Traffic Department Employees also shocked, because the front person head is belongs to others who ride on other bike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X