హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అసహనం..! ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరామాద్ : తెలంగాణ అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి దిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గాల్లో సమస్యల పట్ల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఇంతకాలం సమాధానం చెబుతూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక మీదట తమ వల్ల కాదనే అభిప్రాయాన్ని నిండు శాసనసభలో వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు, స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన వాగ్దానాల గురించి ప్రజలు నిలదీస్తున్నారని, ఇచ్చిన హామీలు ఎప్పటిలోపు నెరవేరుస్తారో చెప్పాలని శాసనసభలో సభాపతి సాక్షిగా మంత్రులను నిలదీస్తున్నారు ఎమ్మెల్యేలు. దీంతో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కాస్త ఇబ్బందికర పరిస్ధితులు తెలెత్తినట్టు తెలుస్తోంది.

సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు..! ఇరుకున పడుతున్న టీ సర్కార్..!!

సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు..! ఇరుకున పడుతున్న టీ సర్కార్..!!

తెలంగాణాలో సుమారు ఐదున్నరేళ్లుగా అదికారం చెలాయిస్తున్న గాలాబీ పార్టీ తమకు ఏపార్టీ పోటీ కాదన్న రీతిలో దూసుకెళ్తోంది. తెలంగాణ లో అన్నీ తానై రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రతిపక్ష పార్టీలను బలహీన పరుస్తూ, సొంత పార్టీలో అసంతృప్తి గళాలు లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు సీఎం. ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుంగా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎప్పకప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చంద్రశేఖర్ రావు.

ఎమ్మెల్యేలలో నిరశన గళాలు..! సమాధానం దాట వేస్తున్న ప్రభుత్వం..!!

ఎమ్మెల్యేలలో నిరశన గళాలు..! సమాధానం దాట వేస్తున్న ప్రభుత్వం..!!

అంతే కాకుండా ప్రభుత్వ అధికారుల్లో కూడా ఎక్కడా అసహనం లేకుంగా, అదికారులకు ఏం కావాలలో జాగ్రత్తగా చూసుకుంటూ వారితో పనులు చేయించుకుంటున్నారు. ఆర్ధిర వ్యవస్ధ దిగజారినా, ప్రభుత్వ ఉద్యోగుల జీతబత్యాలు చెల్లింపుల్లో రెండు మూడు రోజులు జాప్యం జరిగినా ఎవరూ ప్రశ్నించకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇటీవల ప్రభుత్వ అదికారుల్లో అవినీతి తారా స్దాయిలో జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిలు గుప్పిస్తున్నా, సొంత పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని నిర్ధిరిస్తున్నా అంత సినిమా లేదులే అనే రీతీలో ప్రభుత్వం కొట్టి పారేసిన సందర్బాలు కూడా చోటుచేసుకున్నాయి.

తెలంగాణ శాసన సభలో దిక్కార స్వరాలు..! సమాధానం చెప్పలేకపోయిన మంత్రి కేటీఆర్..!!

తెలంగాణ శాసన సభలో దిక్కార స్వరాలు..! సమాధానం చెప్పలేకపోయిన మంత్రి కేటీఆర్..!!

ఇదిలా ఉండగా ఇటీవల ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో జరిగిన అవకతవకల వల్ల ఎంతో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా, దానికి సంబందించిన ప్రభావం ప్రభుత్వం మీద పడకుండా చూసుకుంది. అంతే కాకుండా స్వయంగా రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకుని ఆత్మహత్యల మీద నివేదిక కోరిందంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎంత అవమానకరమో అర్ధం అవుతోంది. కాని ఈ అంశాన్ని కూడా అంత ప్రాధాన్యత లేని అంశంగా తెలంగాణ ప్రభుత్వం కొట్టి పారేసింది. ప్రభుత్వం పైన ఎటువంటి చెడు అభిప్రాయాలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించింది.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..! ప్రజలు తిరగబడుతున్నారంటున్న ఎమ్మెల్యేలు..!!

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..! ప్రజలు తిరగబడుతున్నారంటున్న ఎమ్మెల్యేలు..!!

కాని రోజులన్ని ఒకేలా ఎప్పుడూ ఉండవు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఓడలు బళ్లు అవ్వొచ్చు. బళ్లు ఓడలు అవ్వొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్ధితులు ఇలాగే కనిపిస్తున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలను నిదీస్తున్నా, ప్రజలు తమని ఇబ్బందులు పెడుతున్నా బాధనంతా తమలో తాము దిగమింగుకుని కాలం వెళ్లదీసినట్టు తెలుస్తోంది. కాని నిన్న శాసన సభలో జరిగిన పరిణామాలు మాత్రం తమ సహనానికి హద్దు ఉంటుందనే రీతిలో కొనసాగాయి. చాలా వరకు ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గాల్లో తిరిగే పరిస్తితులు లేవని, ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారని స్పీకర్ సాక్షిగా మంత్రులను నిలదీసారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు ఆరుగురు మంది ఎమ్మెల్యేలు తమ గోడును, ప్రజా వ్యతిరేకతను నిండు శాసన సభలో వినిపించుకున్నారు. దీంతో సమాధానం చెప్పలేని మంత్రి కేటీఆర్ లిఖితపూర్వక సమాధానం ఇస్తామని చెప్పడం మరింత హాస్యాస్పంగా భావించారు తోటి ఎమ్మెల్యేలు. సమస్యల పట్ల మొదలైన అసంతృప్తి గళాలు ప్రభుత్వాన్ని ఇంకెంత స్థాయిలో ఇరుకున పెడతాయో చూడాలి.

English summary
Telangana TRS party mla's demanding for fulfillment of their promises which were given in the election time. In the Legislative Assembly, the opinion of the MLAs who have been answering the questions of the people for problems in the constituencies says in says unable to visit them.This seems to be a bit embarrassing for Chief Minister Chandrashekhar Rao along with ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X