హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీన్మార్ మల్లన్నపై కంప్లైంట్.. అసభ్యకర పోస్టులు అంటూ ఫిర్యాదు...

|
Google Oneindia TeluguNews

పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేసిన నవీన్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బీ దినేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉందంటూ ఇష్టం వచ్చినట్లు తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మల్లన్నకు న్యాయస్ధానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని, షరతులకు విరుధ్ధంగా వ్యవహరిస్తున్నమల్లన్న బెయిల్ రద్దు చేయాలని న్యాయస్ధానాన్ని కోరతామని దినేష్ చెప్పారు.

అంతకుముందు క్యూ న్యూస్ చానల్ సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్ కాంట్రవర్సీగా మారింది. ఆ పోల్ లో అభివృద్ధి ఎక్కడ జరిగింది అని నెటిజన్లను ప్రశ్నించారు. భద్రాచలం గుడిలోనా...? హిమాన్షు శరీరంలోనా...? అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కుమారుడి రూపాన్ని విమర్శించడం పట్ల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ నేతలకు మీరు నేర్పిస్తున్నది ఇదేనా? అసహ్యకరమైన రాజకీయ వ్యాఖ్యల ద్వారా తన బిడ్డ శరీరాకృతిని విమర్శించడం సంస్కారం అనిపించుకుంటుందా? మోడీ కుటుంబాన్నో, అమిత్ షా కుటుంబాన్నో మేం ఈ విధంగా విమర్శించలేమని అకుంటున్నారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కేటీఆర్ ప్రశ్నించారు.

trs party social media complaint to police on teenmar mallanna

ఈ కామెంట్లకు సంబంధించి వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల కూడా కేటీఆర్‌కు సపోర్ట్ చేశారు. మరోవైపు బాల్క సుమన్ కూడా ఫైరయ్యారు. చింతపండు నవీన్ తీరును ఎండగట్టారు. ఇదీ మంచి పద్దతి కాదని ఫైరయ్యారు. హిమాన్షు సహా.. కేటీఆర్‌.. కేసీఆర్‌ను ట్రోల్ చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నవీన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఏకంగా ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. అయినా అతని తీరులో మార్పు రావడం లేదని వివరించారు.

English summary
trs party social media complaint to police on teenmar mallanna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X