TS EAMCET 2020:75.29 శాతం ఉత్తీర్ణత, తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌తో కలిసి ఫలితాలను మీడియాకు తెలిపారు. ఎంసెట్‌లో 75.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89 వేల 734 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిల హవా కొనసాగింది. తొలి 10 ర్యాంకులు అబ్బాయిలే పై చేయి సాధించారు.
వారణాసి సాయితేజ ఎంసెట్ 2020లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. యశ్వంత్ సాయి సెకండ్ ర్యాంక్, టీ మణి వెంకటకృష్ణ మూడో ర్యాంకు దక్కింది. కౌశల్ కుమార్ రెడ్డి 4వ ర్యాంకు, ఆద్రిక్ రాజ్ పాల్ 5వ ర్యాంకు, నాగెల్లి నితిన్ సాయి ఆరు ర్యాంకులో నిలిచారు. తవ్వకృష్ణ రమేశ్ 7, అన్నం సాయివర్ధన్ 8, సాయి వర్ధన్ 9 ర్యాంకుల పొందారు. వారణాసి వచన్ సిద్దార్థ్ 10వ ర్యాంక్ సాధించారు.

గత నెల 9,10,11,14 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 1 లక్ష 43 వేల 326 మంది అప్లై చేసుకోగా.. 1 లక్ష 19 వేల 183 మంది హాజరయ్యాయి. ఫలితాల్లో 89వేల 734 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం 1.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Recommended Video
దరఖాస్తు చేసుకుని కరోనావైరస్ సోకి పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మరోసారి పరీక్ష నిర్వహిస్తుంది. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కరోనా వైరస్ సోకి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications