TS RTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. మొదటగా బండ్లగూడ డిపోలో అమలు..
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకెళ్తోంది. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రూ.5 నుంచి రూ.5 లక్ష వరకు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి చిన్న వ్యాపారి కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, కిరణా దుకాణలు, టీ షాపులు ఇలా ప్రతి చోట డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, పేటీఎం, క్రెడ్, బీము యాప్ ద్వారా ఎక్కువగా యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి.
ఇప్పుడు బ్యాంకులు కూడా తమ యాప్ ల్లో యూపీఐ పేమెంట్ ఆప్షన్లు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని చోట్లు నగదు లేకుండా మనం చేయలేదు. అలాంటి వాటిల్లో ఆర్టీసీ టికెట్ కొనడం ఒకటి. ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకుంటే డిజిటల్ చెల్లింపులు చెయ్యొచ్చు కానీ ఆఫ్ లైన్ టికెట్ కొంటే మాత్రం కచ్చితంగా నగదు అవసరం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ బస్సుల్లో అయితే ఆన్ లైన్ బుకింగ్ ఉండదు కాబట్టి.. కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలి.

అందరు డిజిటల్ వైపు ప్రయాణిస్తున్న విషయాన్ని గ్రహించిన ఆర్టీసీ..ఇప్పుడు బస్సుల్లో కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ చెల్లింపులను త్వరలో అన్ని రకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సహా అన్ని బస్సులకు ఐ- టిమ్స్ యంత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇక ఆర్టీసీ టికెట్ కోసం క్రెడిట్, డెబిట్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, ఇతరు యూపీఐ యాప్ లతో పేమెంట్ చేసి టికెట్ కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ చెల్లింపులను మొదటగా హైదరాబాద్ లోని బండ్లగూడ బస్ డిపో పరిధిలో స్వీకరిస్తున్నారు. ఈ డిపోలోని అన్ని రకాల బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నారు. ఈ డిపోలో 45 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ఐ- టిమ్స్ యంత్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఆ తర్వాత కంటోన్మెంట్ డిపోలో అమలు చేస్తారు. ఈ రెండింటిలో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 8,300 బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు దఫాదఫాలుగా అమలు చేయనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications