tsrtc strike: ఆర్టీసీ కార్మికుల వేతనాలపై యజమాన్యం కొర్రీ, ఏజీ లేరట, విచారణ వాయిదా..
గత 52 రోజులుగా సమ్మె కొనసాగుతుండటం, సెప్టెంబర్ నెల వేతనం కూడా రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తమకు వేతనాలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించగా.. సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తమకు మరింత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టును కోరడంతో విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

వేతనం కోసం..
తమకు వేతనం ఇప్పించాలని కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. తమకు మరింత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కోరింది.

సరికాదు..
ఆర్టీసీ వాదనలను పిటిషనర్లు తప్పపట్టారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తుచేశారు. జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది వరకు కార్మికులు చనిపోయారని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పూర్తి వాదనలు బుధవారం వింటామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

విలీనం కోసం ఆందోళన
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు దిగారు. గత 52 రోజుల నుంచి నిరసన కొనసాగుతుంది. అయితే కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల వేతనం కూడా అందించలేదు. దీంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. తమ వేతనాలు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించాయి.
Recommended Video

కేంద్రమే దిక్కు..
అక్టోబర్ 5వ తేదీకి ముందు లాగానే విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసినా.. సీఎం కేసీఆర్ మాత్రం బెట్టువీడటం లేదు. కార్మికుల విధులకు సంబంధించి మాట్లాడటం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైకోర్టులో కూడా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు రావడం వారిని కలిచివేస్తోంది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని.. ఆర్టీసీ ప్రైవేట్ రూట్లకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కార్మికుల గోడును పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఆర్టీసీ జేఏసీ మాత్రం కేంద్ర పెద్దలకు తమ సమస్యను తీసుకెళ్తామని చెప్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications