Sambasiva Rao: ఇదేందయ్యా సాంబశివ రావు.. చెప్పేవి నీతులు.. చేసేవి డాష్ పనులు..!

అతను ఓ న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్నాడు. డిబెట్లు పెట్టి మోసాలను, అవినీతి కడిగేస్తాడు. ఇదేక్కడి అన్యాయమని నిలదీస్తాడు. కానీ అతడు మాత్రం ఇవేవి పాటించాడు. మోసాలకు పాల్పడుతుంటాడు. అతను ఎవరో కాదు.. డిబెట్లు పెట్టి వేదాలు వల్లించే సాంబశివ రావు. అతను జూబ్లీ హిల్స్ చెక్ సమీపంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ పెద్ద పోజిషన్ లో వర్క్ చేస్తున్నారు. అతని పోజిషన్ పెద్దదే కానీ.. అతని బుద్ధి మాత్రం చాలా చిన్నది.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను తప్పుదోవ పట్టించాడు. అయితే మోసం ఎంత కాలం చెల్లుతుంది. అతని బండారం బయటపడింది. దీంతో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ ను హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. తన ప్లాట్ ను ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశాడు బాధితుడు హెచ్పీసీఎల్ కు ఫిర్యాదు చేయడంతో బండారం బయట పడింది. అస్సలు సాంబశివరావు ఎలా మోసానికి పాల్పడ్డంటే..

TV5 Sambasivarao police have registered a case of cheating

సరనాల శ్రీధర్ రావుకు మాదాపూర్ భూమి ఉంది. ఇది అతని భార్య పేరు మీద ఉంది. 717 గజాల జాగ వీరికి ఉంది. సాంబశివ రావు 2018లో శ్రీధర్ రావును కలిశాడు. హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్ షిప్ ఇప్పిస్తానని చెప్పాడు. ప్లాట్ సంబంధించిన పత్రాలను చూశాడు. ఆ తర్వాత వెళ్లిపోయాడు. అప్పుడే సాంబశివ రావులోని అస్సలు వ్యక్తి బయటకు వచ్చాడు. ల్యాండ్ ను పోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు పత్రాలను సృష్టించాడు.

ఆ పత్రాలతో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలషిప్ ను కొల్లి సౌమ్య పేరు తీసుకున్నాడు. పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రావు తన స్థలం వద్దకు వెళ్లి చూడగా పెట్రోల్ బంక్ కనిపించింది. షాక్ అయిన అతను సాంబశివరావును నిలదీశాడు. 2021 లో హెచ్పీసీఎల్ తో డీలర్ షిప్ అగ్రిమెంట్ కు ఒప్పుకోవాలంటూ శ్రీధర్ ను బెదిరించాడు. తన న్యూస్ ఛానల్ పెద్ద పోజిషన్ లో ఉన్నానని చాలా మంది తెలుసంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.

దీంతో శ్రీధర్ రావు డీలర్ షిపు తన పేరుపైకి మార్చాలని కోరాడు. దానికి సాంబశివరావు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అతను డిమాండ్ చేసినా డబ్బు ఇచ్చినప్పటికీ డీలర్ షిప్ శ్రీధర్ రావు పేరు మీదికి మార్చలేదు. దీంతో శ్రీధర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఎచ్పీసీఎల్ అధికారులు వచ్చి బంక్ ను మూసివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+