హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేక్ ఐడీ క్రియేట్.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. పేక్ ఐడీ తయారు చేశారంటూ ఆయనపై 406/66 ఐటీ యాక్ట్ కింద సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. నటరాజన్ అనే వ్యక్తి పేరుతో ఐ ల్యాబ్ సంస్థ నుంచి జారీ అయినట్లుగా ఫేక్ ఐడీ క్రియేట్ చేసినట్లు రవిప్రకాశ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్‌ను పిటీ వారెంట్ ద్వారా మియాపూర్ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు.

టీవీ9 ఛానల్ సీఈవోగా వ్యవహరించిన రవిప్రకాశ్‌పై సంస్థ నిధులు దారి మళ్లించారనే కేసు నమోదైంది. ఆ క్రమంలో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనపై మరో కేసు నమోదు కావడం చర్చానీయాంశమైంది. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐ ల్యాబ్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరు పరిచారు.

tv9 ceo ravi prakash again in one more case

టీవీ9 సంస్థ తొలుత ఎబీసీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది. ఆ సమయంలో రవిప్రకాశ్ ఆ సంస్థకు సీఈవోగా వ్యవహరించారు. అయితే సంస్థకు చెందిన 18 కోట్ల రూపాయలను బోర్డు సభ్యులకు చెప్పకుండా అక్రమంగా దారి మళ్లించారనే అభియోగాలు నమోదయ్యాయి. ఆయనతో పాటు మరో ఉద్యోగి కేవీఎన్ మూర్తి కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. అలందా మీడియా ప్రతినిధులు వీరిద్దరిపై కేసు పెట్టారు. ఆ క్రమంలో రవిప్రకాశ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఛానల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు మాయం కావడం.. ఫోర్జరీ సంతకాలు తదితర ఆరోపణలు కూడా ఆ కేసులో కీలకంగా మారాయి.

English summary
One more case filed on tv9 ex ceo ravi prakash in fake id creation from famous company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X