హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో 2 నెలల పాప కిడ్నాప్ కథ సుఖాంతం: నిందితుల అరెస్ట్ ఇలా
హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో రెండు నెలల ఆడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రి బయట ఉన్న ఫుట్‌పాత్‌పై కొన్ని నెలలుగా ఓ మహిళ తన రెండు నెలల పసికందు నివసిస్తోంది. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం ఇక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అక్కడే ఉంటున్న మరో మహిళ, మరో బాలుడితో కలిసి.. రెండు నెలల పాపను కిడ్నాప్ చేశారు. చిన్నారి కనిపించకుండా పైన వస్త్రం కప్పి.. అఫ్జల్‌గంజ్ చౌరస్తాలో బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అయితే, కొద్దిసేపటి తర్వాత నిద్రలో నుంచి లేచిన మహిళ.. తన బిడ్డ కనిపించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. వెంటనే అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ దృశ్యాలను సీసీ ఫుటేజీ ఆదారంగా గుర్తించిన పోలీసులు.. పాపను అపహరించిన మహిళతోపాటు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతానికి పాపను తరలిస్తుండగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాపను కిడ్నాప్ చేసిన మహిళది మహారాష్ట్ర, యువకుడిది జార్ఖండ్ అని పోలీసులు గుర్తించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్యంతో మూడు నెలల గర్బిణీ మృతి చెందింది. రక్తస్రావం కావడంతో స్థానిక సాయి రామ్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతో మూడు నెలల గర్భిణి అయిన నందిని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చినా పట్టించుకోలేదని.. ట్రీట్మెంట్ చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు.
డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. తన భార్య మృతికి కారణం అయిన డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందిని భర్త డిమాండ్ చేశారు. నందిని మృతితో తల్లికి దూరమైన చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నందిని మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications