Cyber Crime: గిఫ్ట్ ల పేరుతో మోసం.. రూ.25 లక్షలు మోసపోయిన ఇద్దరు మహిళలు..
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. సైబర్ మోసాలు ఆగడం లేదు. అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా మార్చుకున్న సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ మోసాలకు తెగపడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసగాళ్లు గిఫ్టుల పేరుతో మహిళలను మోసం చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళలు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజేఆర్ ఎంక్లేవ్ కాలనీలో ఉంటున్నారు.
వీరిద్దరిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు మంచి గిఫ్ట్ ఇస్తామని నమ్మబలికారు. టాస్క్ పేరుతో ఆన్ లైన్ ద్వారా మొత్తం రూ. 25,23,375 దొచుకున్నారు. మొదటి మహిళ నుంచి రూ.20,63,375, మరో మహిళ నుంచి రూ. 4,60,000 నగదు కాజేశారు. ఎట్టకేలకు మోసపోయామని తెలుసుకున్న సదరు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగినా ప్రజలు మాత్రం అమాయకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మబలికారు.
నాగరాజు మొబైల్ నంబర్‌కు ఓటీపీని పంపించారు. ఓటీపీ ఓపెన్ చేయగానే క్రెడిట్ కార్డ్ నుంచి 19,999 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న నాగరాజు కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. అయితే సైబర్ మోసగాళ్లో చేతిలో సామాన్య ప్రజలే కాదు ప్రముఖులు కూడా మోసపోతున్నారు.












Click it and Unblock the Notifications