• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫేస్‌బుక్ పరిచయం వారిద్దరినీ దగ్గర చేసింది. మనసులు కలిసిన వేళ తనువులు ఒక్కటయ్యాయి. అలా ఆ ఇద్దరి యువకుల మధ్య అనైతిక అసహజ సంబంధం పెనవేసుకుంది. తరచుగా ఏదో లాడ్జీలో దూరడం.. ఆ పని కానిచ్చేయడం వారికి పరిపాటిగా మారింది. రెండేళ్లుగా వారి మధ్య అది కామన్ అయింది. చివరకు ఆ ఇద్దరు పరలోకానికి వెళ్లడం చర్చానీయాంశమైంది.

ఏపీకి చెందిన యువకుడు.. తెలంగాణకు చెందిన మరో యువకుడు.. ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెదిలారు. ప్రాంతాలు వేరైనా వారిని ఫేస్‌బుక్ కలిపింది. అందులో ఒకరు ఉన్నత విద్యావంతుడు కావడం గమనార్హం.

ఆ సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది..!

ఆ సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది..!

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన 29 సంవత్సరాల కొండా శ్రీకాంత్‌రెడ్డి ఢిల్లీలో ఐఐటీ, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. దుబాయ్‌లో డాక్టరేట్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం మూసల్‌పూర్ గ్రామానికి చెందిన 26 సంవత్సరాల డబ్బి నరేశ్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. అనైతిక సంబందానికి అలవాటుపడ్డారు.

రెండేళ్లుగా వారి మధ్య ఆ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. అయితే వారిలో ఒకరికి పెళ్లి కుదరడం ఇద్దరి మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ఒకరు వెళ్లిపోతే మరొకరు విడిచిపెట్టలేనంత బంధం వారి మధ్య పెనవేసుకోవడంతో ఆ ఇద్దరి చావుకు కారణమైంది.

మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా.. రహస్య కెమెరాలతో వీడియోలు..!మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా.. రహస్య కెమెరాలతో వీడియోలు..!

ఒకరికి పెళ్లి కుదిరి.. చివరకు ఇలా

ఒకరికి పెళ్లి కుదిరి.. చివరకు ఇలా

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఇద్దరు యువకులు గొంతుకోసుకుని చనిపోయారనే వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న శ్రీకాంత్ రెడ్డి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడికి పెళ్లి కుదరడంతో.. జూన్ 19వ తేదీన నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే అదే విషయం నరేశ్‌కు చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగానే లాడ్జీలో కలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి, నరేశ్ మధ్య పెళ్లికి సంబంధించిన టాపిక్ వచ్చింది. ఊళ్లో జరిగిన విషయం శ్రీకాంత్ రెడ్డి, నరేశ్‌కు చెప్పడంతో అతడు కోపోద్రిక్తుడైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్లుగా కలిసి ఉన్న తాము.. శ్రీకాంత్ రెడ్డికి పెళ్లైతే విడిపోతామనే ఆవేదనతో నరేశ్ అతడి గొంతు కోసినట్లు భావిస్తున్నారు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య ప్రయత్నంలో గొంతు కోసుకుని ఉంటాడేమోననే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

కొంప ముంచిన స్వలింగ సంపర్కం..!

కొంప ముంచిన స్వలింగ సంపర్కం..!

ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం ఇంతవరకు తెచ్చిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి పెళ్లి ఫిక్స్ కావడంతో.. తాము ఎక్కడ విడిపోతామనే బాధతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా అనేది మరో కోణంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో శ్రీకాంత్ చనిపోగా నరేశ్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు మాత్రం దీన్ని హత్యకోణంలోనే చూస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటారని సమాచారం. మొత్తానికి ఇద్దరు యువకుల మధ్య పెనవేసుకున్న అసహజ సంబంధం వ్యవహారం చివరకు ఇలా ముగిసింది.

English summary
Two Youngsters died in lodge may hot topic in hyderabad SR Nagar police limits. They have illegal sexual contacts who belongs to one of them andhrapradesh and other is from telangana. Marriage is set to one of them, that is the cause to two deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X