హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ కిందకు చొచ్చుకెళ్లిన బైక్... ఇద్దరు మృతి...

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను చాదర్ ఘాట్‌కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా,విశాఖపట్నం జిల్లా అరకులోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో మృతి చెందిన నలుగురి మృతదేహాలను ఆదివారం హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న వారి నివాసాలకు తరలించిన సంగతి తెలిసిందే.సాయంత్రం షేక్‌పేట్‌ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన మరో 16 మంది మినీ బస్సులో షేక్‌పేట చేరుకున్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతుల ఇంటికి చేరుకొని మృతదేహాల వద్ద నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, బంధువులు అక్కడికి వచ్చారు.

two youth killed after a bike rams into a lorry in Hyderabad

Recommended Video

    #TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections

    నగరానికి చెందిన 27 మంది విహారయాత్రకు వెళ్లగా.. అరకు వద్ద బస్సు లోయలో పడటంతో ప్రమాదం జరిగింది. సత్యనారాయణ, శ్రీనిత్య, సరిత, లత అనే నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ మరో 16 మందిని సైతం చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కేజీహెచ్‌ ఆస్పత్రిలో సరైన వైద్యం అందలేని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని, హైదరాబాద్‌కు పంపిస్తే తామే వైద్యం చేయించుకుంటామని చెప్పామని బాధితులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+