నిరుద్యోగ బంధు కేసీఆర్: రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నిరుద్యోగుల సంబరాలు
తెలంగాణలో కొలువుల భర్తీ ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు పటాకులు కాల్చి, సంబురాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించడంతో సీఎం కేసీఆర్‌కు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వయో పరిమితి పెంచడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
సంబరాలు..
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు అంబరాన్నంటాయి. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
పాలాభిషేకం..
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. కేసీఆర్ ప్రకటన కోసం నిన్నటి నుంచి సంబరాలకు ఏర్పాటు చేస్తోన్న టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ప్రకటన చేయగానే వేడుకలు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు పెట్టారు. పలు జిల్లాలలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
నిరుద్యోగుల హర్షం..
ఉద్యోగాల భర్తీ ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. 11 వేల పైచిలుకు కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యురల్ చేస్తారు.వీటితో కలిపి కొలువుల మొత్తం సంఖ్య 91,142కి చేరాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. క్యాడర్ వారీగా ఖాళీలు వివరాలు ఉన్నాయి. జిల్లాల్లాలో- 39,829 పోస్టులు.. జోన్లలో- 18,866 పోస్టులు.. మల్టీజోనల్ పోస్టులు- 13,170, సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 కొలువులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications