Chirajeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే..!
ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కలిశారు.
కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం హైదరాబాద్ లో పర్యటించారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, హీరో అక్కినేని నాగార్జున, నిర్మాత అల్లు అర్వింద్ ను కలిశారు. ఆదివారం అనురాగ్ ఠాకూర్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవి, నాగార్జున, అర్వింద్ తో చర్చించారు.
సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోమవారం ఉదయం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీరు మమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని చిరు తన ట్విట్టర్ లో తెలిపారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ సాధిస్తున్న పురోగతి గురించి నాగార్జునతో కలిసి మీతో చర్చించడం సంతోషంగా ఉందన్నారు.

తమ కోసం సమయం కేటాయించినందుకు మంత్రి అనురాగ్ ఠాకూర్ కు చిరు ధన్యవాదాలు తెలిపారు. "ప్రియమైన అనురాగ్ ఠాగుర్ కు ధన్యవాదాలు. నిన్న మీ హైదరాబాద్ పర్యటనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు. నా సోదరుడితో నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరియు అది వేగవంతమైన పురోగతి గురించి! చర్చించడం నచ్చింది" అని చిరు ట్వీట్ చేశారు.
అయితే అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం పట్ల పలు ఊహగానాలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి పని చేయడానికి చిరును ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి కేవలం పుకార్లుగానే తెలుస్తోంది.
Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday.
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023
Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna
about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications