Hyderabad: నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‍కు మొదటి స్థానం..
నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.
తాజా నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) అగ్రస్థానం దక్కించుకుంది. UoH భారతీయ విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానంలో నిలిచింది. విద్యా రంగంలో భారతదేశంలోని అన్ని సంస్థలలో 16వ స్థానంలో ఉంది. నేచర్ ఇండెక్స్ సహజ, భౌతిక శాస్త్రాలలో (కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఎర్త్ & ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌తో సహా) అధిక-నాణ్యత పరిశోధనను సూచిస్తుంది.
భారతీయ విశ్వవిద్యాలయాలలో UoH అగ్రస్థానంలో నిలవడం పట్ల వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ BJ రావు సంతోషం వ్యక్తం చేశారు. తాము అన్ని విభాగాలలో బాగా పని చేస్తున్నామన్నారు. మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ కావడంతో తమ పనితీరు చాలా బాగుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో పోల్చితే, సంబంధిత విభాగాల్లో మా విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇందుకు UoHలోని ప్రతి ఒక్కరినీ తప్పక అభినందించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉండటానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ ర్యాంకింగ్‌లు 1 డిసెంబర్ 2021 నుండి 30 నవంబర్ 2022 వరకు నేచర్ ఇండెక్స్ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు.












Click it and Unblock the Notifications