ముహూర్తం ఖరారు..! ఆ రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీ సర్కార్..!
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షల నుండి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక రవాణా, భవన నిర్మాణాలు, మద్యం షాపులు, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్లు, సిమెంటు, హార్డు వేర్ షాపులకు అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అంశానికి కూడా వెసులుబాటు కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో దాదాపు సాధారణ జీవితం మొదలైనట్టుగా ప్రజలు స్వేచ్చా జీవితాన్ని గడిపేస్తూ రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం నుంచి మరో ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దాంతో మరిన్ని వాహనాలు రెడ్డెక్కే సంకేతాలు స్పష్టంగా కపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కీలకం కాబోతోంది.

దాదాపు నెలన్నరగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్లో స్లాట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య గురువారం సాయంత్రానికి భారీగా పెరిగినట్టు కూడా తెలుస్తోంది. ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1640 స్లాట్స్ బుక్ అయ్యాయి.
వీరంతా శుక్రవారం అందుబాటులో వున్న వాహనాల రిజిస్ట్రేషన్ స్లాట్లను బుక్ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్లాట్స్ బుక్ చేసుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల ఖాళీ స్థలాలను బట్టి బుకింగ్ దారులకు ఆహ్వానం పంపుతున్నారు అధికారులు. పూర్తి భౌతిక దూరంతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications