వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మధ్యాహ్నాం మృతిచెందారు. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోధా ఆస్పత్రిలో చేరారు వేణుమాధవ్. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూను కన్నుమూశారు. వేణుమాధవ్ మృతితో ఆయన స్వగ్రామం కోదాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నవ్వుల జల్లు, హాస్య జరి .. వేణుమాధవ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అతి చిన్న వయస్సులోనే కళామతల్లిని వదిలిపెట్టి .. అభిమానులను దు:ఖసాగరంలో నింపి వెళ్లిపోయాడు. వేణుమాధవ్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగిన నటుడు అని కొనియాడారు. వేణుమాధవ్ మృతి సినీ రంగానికి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్.

మరోవైపు వేణుమాధవ్ స్వస్థలం కోదాడలో విషాదచాయలు అలుముకున్నాయి. తన కామెడీతో నవ్వులు పూయించే మా రాజు లేరనే వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేణుమాధవ్ మృతి వార్త తెలిసి గ్రామంలో విషాద వదనం నెలకొంది. ప్రతీ ఒక్కరు వేణును తలచుకొని రోదిస్తున్నారు. వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ దాదాపు 400 పైచిలుకు సినిమాల్లో నటించారు. హాస్యనటుడిగా నటించి .. నవ్వుల పువ్వులు పూయించాడు. తెలుగు సినీ వినిలాకాశంలో నవ్వుల రారాజుగా నిలిచిపోయారు. వేణు మాధవ్ ఇకలేరనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications