Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్, రోడ్లపైనే గంటలుగా..: పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనాల బారులు

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనేక మార్గాల్లో రహదారులపై గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, పెట్రోల్ బంకుల వద్ద కూడా భారీగా వాహనాలు బారులు తీరాయి. కాగా, హిట్‌ అండ్‌ రన్‌ కేసుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ ఆయిల్​ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

 very Heavy Traffic Jam in Hyderabad city: Huge rush at petrol bunks

ఫలితంగా హైదరాబాద్ నగరంలోని పలు బంకుల్లో పెట్రోల్ లేక నో స్టాక్​ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారులు పెట్రోల్​, డీజిల్​ కోసం బంకుల ముందు బారులు తీరారు. మీటర్ల మేర లైన్లు కట్టడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్​ స్తంభించింది. నారాయణగూడ, బషీర్​‌బాగ్, హైదర్‌​గూడ, లక్డీకపూల్​, అబిడ్స్ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

 very Heavy Traffic Jam in Hyderabad city: Huge rush at petrol bunks

ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి లక్డీకపూల్‌ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మెహదీపట్నం నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించడంతో ట్రాఫిక్​ పోలీసులు రంగంలోకి దిగారు.


వాహనదారులను నియంత్రిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారని, గంటలోపు యధావిధిగా పెట్రోల్​ దొరుకుతుందని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

అయితే, చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ట్యాంకులు రాకపోవడంతో పెట్రోల్ బంకుల్లోనే వాహనదారులు వేచిచూస్తున్నారు. గంటలపాటు వేచిచూస్తున్నామని.. పెట్రోల్ బంకుల యాజమాన్యం మాత్రం మరికొద్ది సమయంలో ట్యాంకులు వస్తున్నాయని చెబుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+