Mahesh Babu: ఇలాంటి ఘాతుకాల్లో మరణశిక్ష పడాల్సిందే: మహేష్ బాబు డిమాండ్: కేంద్రానికి, కేటీఆర్ కు..!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి మహిళా డాక్టర్ దారుణ హత్యోదంతంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వెటర్నరి డాక్టర్ హత్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడాలంటే భయం కలిగించేలా చట్టాలను సవరించాలని అన్నారు.

ఈ మేరకు ఆదివారం వరుసగా ట్వీట్లను సంధించారు. వాటిని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), తెలంగాణ మంత్రి కేటీఆర్ లకు ట్యాగ్ చేశారు. రోజులు మారుతున్నా, నెలలు మారుతున్నా, సంవత్సరాలు మారుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రావట్లేదని మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పును తీసుకుని రావడంలో మనం సమష్టిగా విఫలం అయ్యామని చెప్పారు.

veterinary doctor murder: we need stricter laws, capital punishment for heinous crimes like these, demands actor Mahesh Babu

సమాజంలో మార్పులు తీసుకుని వచ్చేలా దేశ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని, వెటర్నరి డాక్టర్ హత్యకు సంబంధించినటువంటి ఉదంతాలు మళ్లీ, మళ్లీ చోటు చేసుకోకుండా ఉండటానికి కఠిన శిక్షలను విధించాలని అన్నారు. ఇలాంటి ఘాతుకాల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చట్టాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

వెటర్నరి డాక్టర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని మహేష్ బాబు అన్నారు. వెటర్నరి డాక్టర్ కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరని చెప్పారు. మహిళలు, అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి మనం అందరం ఏకం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను తీసుకోవాలని చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రజలు ఏకతాటిపైకి రావాలని అన్నారు. మనదేశంలో మహిళలకు ఎలాంటి ఢోకా లేదనే పరిస్థితులను తీసుకుని రావాలని మహేష్ బాబు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+