Sam-chay:వెంకీ మామా ఎమోషనల్ పోస్ట్.. వారి గురించేనని చర్చ
టాలీవుడ్ మోస్ట్ లవ్‌లీ కపుల్ నాగచైతన్య- సమంత విడిపోయారనే మాటను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా చైతు మామ, విక్టరీ వెంకటేశ్ రియాక్టయ్యారు. అయితే ఆయన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశారు. క్యాజువల్‌గా వెంకీ అంటేనే ఆధ్యాత్మికత.. ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. దైవ భక్తి కాస్త ఎక్కువే.. ఆయన మాటలు కూడా అలానే ఉంటాయి.

వెంకీ పోస్ట్
టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంత విడిపోవడంతో వారి బంధువులు, మిత్రులు ఏ పోస్టు చేసినా అది వారి గురించేననే ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. అది నాగ చైతన్య, సమంత గురించే అయి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనసు ఆలోచనలతో నిండి వుంటుందనీ, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆయన ఓ కొటేషన్ చేశారు. అంతకుముందు కూడా మనం ఏదైనా విషయంపై మాట్లాడేముందు మొదట కాస్త మెదడుతో ఆలోచించాలని సజెస్ట్ చేశారు. సాధారణంగా వెంకటేశ్ రెగ్యులర్‌గా ఇటువంటి కొటేషన్లు పెడుతుంటారు. అయితే చై-సామ్ విడిపోయిన వేళ ఆయన చేసిన పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.

పేరు మార్పు
సమంతా మరోసారి తన పేరు మార్చుకుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. ఆ మధ్య సమంతా ఓ బేబీ సినిమా సమయంలో బేబీ అక్కినేనిగా తన సోషల్ మీడియా ఖాతాను మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే చైతూతో విడాకుల రూమర్స్ బయటకి వచ్చిన కొత్తలో కొన్ని ఖాతాల్లో పూర్తిగా తన పేరు తొలగించి ఓన్లీ ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ప్రొఫైల్ నేమ్‌గా పెట్టుకుంది. మరికొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో జస్ట్ సమంత అనే పదాన్ని మాత్రమే ఉంచింది.

మళ్లీ అదే పేరు
ఇప్పుడు మరోసారి నేమ్ ఛేంజ్ చేసింది. నిన్నటి వరకు ఉన్న ఎస్ అనే అక్షరాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మార్చింది. సమంత అని పేరును మార్చింది. శనివారం అధికారికంగా చైతన్యతో విడాకుల అంశాన్ని ధృవీకరించిన సామ్.. ఆదివారం ఇలా పేరు మార్చేయడం కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారుతుంది. నిజానికి చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. తర్వాత సమంత అక్కినేని, డైవర్స్ రూమర్స్ సమయంలో ఎస్, ఇప్పుడు మళ్ళీ సమంతకి ఫిక్స్ అయ్యారు.












Click it and Unblock the Notifications