Public romance:హద్దులు దాటుతున్న హీరో, హీరోయిన్ల రొమాన్స్..?
గతంలో ఓ సినిమా ప్రేక్షకులకు చేరాలంటే నానాపాట్లు పడాల్సి వచ్చేది. కాని కాలం మారుతున్న కొద్ది.. సినిమాలు చూసే వారితో పాటు, సినిమాల్లో నటించేవారిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.నేటి తరానికి తగ్గట్టుగా ..సినిమా వాళ్ల మైండ్‌సెట్ కూడా మారుతుంది. ప్రేక్షకులకు సినిమా చేరాడానికి నేటితరం నటులు చేయని ప్రయత్నాలు లేవు. చిన్ని హీరో నుంచి .. పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాను ఏదో రకంగా ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారే.
నేటి తరం హీరోలు సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే సోషల్ మీడియాను వినియోగించుకుని సినిమాను ప్రమోట్ చేయడం వేరు... సోషల్ మీడియాలో నానటం వేరు. ఇద్దరు కుర్ర హీరోలు చేసిన పని అచ్చం ఇలాగే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇద్దరూ కూడా తమ సినిమాను ప్రమోట్ చేయడానికి కొత్త పంథా ఎంచుకున్నారు

తాజాగా ఈ ఇద్దరూ హీరోలు స్టేజ్‌పై డ్యాన్సులు వేసి మరి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ , సమంత జోడిగా నటించిన 'ఖుషి' మ్యూజికల్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ .. తరువాత విజయ్ దేవరకొండ తన షర్ట్‌ను విప్పి మరి సమంతను ఎత్తుకుని తిప్పడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

షర్ట్ విప్పాల్సిన అవసరం ఏముందంటూ నెటిజన్లు విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే... హీరో విశ్వక్ సేన్ కూడా సరిగ్గా ఇలాంటి తరహా సీన్ ఒకటి స్టేజీ మీద చేశారు. విశ్వక్ సేన్ కొత్త చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని 'సుట్టంలా సూసి పోకల' పాటను విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ నేహాశెట్టి స్టేజీ మీదనే రెచ్చిపోయి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. నేహా శెట్టి తన చీరను విప్పి మరి హీరోకు కప్పుతుంది. హీరో విశ్వక్ సేన్ నేహా శెట్టి చీరను చుట్టుకుంటూ నేహాను హత్తుకుంటాడు. ఆ ఘటనపై కూడా విమర్శలు వస్తున్నాయి. సాంగ్ లాంచ్‌కు వచ్చి ఇలా చేయడం ఏంటని హీరో , హీరోయిన్లను కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ రెండు ఘటనలపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌ల్లో ఇలా పచ్చిగా రొమాన్స్ చేయడం ఏంటని వారిన నిలదీస్తున్నారు. అయితే దీనిపై హీరో, హీరోయిన్లకు మద్దతుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు .ప్రస్తుతానికి అయితే రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications