హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూనిఫామ్‌ను గౌరవిస్తాం.. విజువల్స్ చూడండి: రేణుకా చౌదరి(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఎస్సై ఉపేంద్రబాబు కాలర్‌ను కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై దుమారం చెలరేగింది. దీంతో రేణుకా చౌదరి స్పందించారు. ఏం జరిగిందో వివరించారు. తనే తప్పు చేసినట్టు మీడియా చూపిస్తోందని అన్నారు. అసలు ఏం జరిగిందో ఫుటేజ్‌లో చూడాలని కోరారు. అలా కాకుండా తనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని వివరించారు.

యూనిఫాం అంటే ఏంటో తెలుసు..?

యూనిఫాం అంటే ఏంటో తెలుసు..?


పోలీసు యూనిఫాం అంటే ఏంటి, ఎలా గౌరవించాలనేది తమకు తెలుసు అని రేణుకా చౌదరి అన్నారు. పోలీసులు కూడా గౌరవం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. తమ చుట్టూ ఎందుకు మగ పోలీసులను మోహరించారని అడిగారు. లేడీ కానిస్టేబుల్స్ ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కానీ మగ పోలీసులను ఎందుకు ఉంచారని అడిగారు. పోలీసులపై దాడి చేయాలని తనకెలాంటి ఉద్దేశం లేదన్నారు. తనను నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో అదుపుతప్పి పోలీసులపై పడిపోయానని చెప్పారు.

 విజువల్స్ చూడండి...?

విజువల్స్ చూడండి...?


అసలు ఏం జరిగిందో విజువల్స్ చూడాలని కోరారు. తనను నెట్టివేయడంతో ఆసరా కోసం అతడి భుజాన్ని పట్టుకునే ప్రయత్నం చేశానని వివరించారు. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అతడి కాలర్ పట్టుకోలేదన్నారు. వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుందని... కానీ తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తున్నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని రేణుకా చౌదరి మండిపడ్డారు.

 కాలర్ పట్టుకున్న రేణుకా

కాలర్ పట్టుకున్న రేణుకా


రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ ముట్టడించాయి. ఉద్రిక్తతల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పంజాగుట్ట ఎస్సై ఉపేంద్రబాబు కాలర్ పట్టుకున్నారు. దీనిపై ఎస్సై ఉపేంద్రబాబు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఘటనపై రేణుకా చౌదరి వివరణ ఇచ్చారు.

English summary
we are respected police. what happened while hold si collar renuka chaudhary explained
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X