హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, రెండు రోజులు అలర్ట్, హెల్ప్‌‌లైన్ నెంబర్స్

హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం కూడా ముసురు కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్

హైదరాబాద్‌లో రెయిన్ అలర్ట్

హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను, ప్రజలను భారీ వర్షాల పట్ల అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు: హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే

భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి తలసాని ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించాలని సూచించారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని సూచించారు. ఇది ఇలావుండగా, ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040- 29555500

తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, వరంగల్‌ తదితర జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు కూడా ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+