హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉత్తర-దక్షిణ ద్రోణి ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్త వరకు కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

ఆదివారంనాడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Recommended Video

రోగ నిరోధక శక్తి కావాలా... ఇలా చేయండి *Health | Telugu OneIndia
weather alert: today and tomorrow heavy rain in these districts in telangana.

సోమవారంనాడు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

కాగా, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 27న మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరో రెండు మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.

నిండుకుండల్లా ప్రాజెక్టులు

నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం తగ్గక పోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు పంపిస్తున్నారు. జలాశయం ఎగువ నుంచి 2 లక్షల 14వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో సాగర్​ 20క్రస్ట్​ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్​వే ద్వారా 1లక్ష 16 వేల120 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నా రు.సాగర్​ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులు చేరింది. 312 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయం పూర్తిగా నిండిపోయింది.

జులై చివరి వారం నుంచి నాగార్జున సాగర్ జలాశయం కు ప్రారంభం అయిన వరద ప్రవాహం తో ఆగస్టు 11 నుంచి 26 గేట్లను ఎత్తి 13 రోజుల గా నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహo కాస్త తగ్గుముఖం పట్టడంతో గేట్లను అధికారులు అధికారులు మూసివేశారు.మళ్లీ నీటి ప్రవహాన్ని బట్టి గేట్లను ఎత్తుతూ మూస్తూ వస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఇతర ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

English summary
weather alert: today and tomorrow heavy rain in these districts in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X