హైదరాబాద్‌లో వర్షం: చల్లబడిన వాతావరణం, నగర జీవికి కాస్త ఉపశమనం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం పడింది. మండె ఎండలు, వడగాలులతో సతమతమవుతున్న నగర ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురిసింది. బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, నేరేడ్​మెట్, మల్కాజిగిరి ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

కంటోన్మెంట్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జీడిమెట్ల, సురారం, బహదూర్‌పల్లిలో వాన పడింది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మొత్తానికి ఎండలు మండిపోతున్న సమయంలో వాన జల్లులు పడటం వల్ల వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టైంది.

weather: rain in hyderabad city area, some other places also .

కాగా, శనివారం, ఆదివారం మధ్యాహ్నం వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రజలకు కొంత ఉశమనం కలిగింది. కానీ, రానున్న రెండు మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+