Rain: హైదరాబాద్‌కు భారీ వర్షం, తెలంగాణలోని ఈ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వానలు ఆగడం లేదు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని మోస్తురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సోమవారం రాష్ట్రంలో అక్కడకడ్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్ నగరంలోని ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 91 మి.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 10న గోల్కొండలో అధికంగా 49.5 మి.మీ వర్షపాతం కురిసింది.
ముషీరాబాద్, సైదాబాద్, నాంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, షేక్‌పేట్, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, ఆసిఫ్ నగర్, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌లో 30 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు, రుతుపవన ద్రోణి ప్రభావంతో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications