తెలంగాణ దిశగా ఉపరితల ఆవర్తనం: మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధప్రదేశ్ తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో నిన్నటి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది పశ్చిమవైపునకు వంతపు తిరిగింది.
సోమవారంనాడు ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. సోమవారంనాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో పలు జిల్లాల్లో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు తెలిపారు.
కాగా, సోమవారం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జులై రెండో వారం నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జులై మొదటి వారంలో వర్షాలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications