రైల్వే టికెట్లపై ఉండే PNR అంటే ఏమిటో తెలుసా?

మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటాం. అలా టికెట్లు బుక్ చేసినప్పుడు PNR నెంబరు ఇస్తారు. టికెట్ ఓకే అయిదా లేదంటే వెయిటింగ్ లిస్టులో ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ PNR నెంబరు ఉపయోగపడుతుంది. ప్రయాణికుల పేరు, చేరుకోవాల్సిన గమ్యం, రైలు కోచ్, సీట్ నెంబరు అన్నీ PNR నెంబరుతో వస్తాయి. PNR అనేది రైల్వే దగ్గర ఉండే ప్రయాణికుల సమాచారంతో కూడిన రిపోజిటరీ. ఇది పది అంకెలతో ఉంటుంది. PNR అంటే పూర్తి అర్థం Passenger name records.

వందే భారత్ తోపాటు వందే సాధారణ్
మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను సమకూరుస్తోంది. రైళ్లల్లో కూడా అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లతోపాటు త్వరలోనే ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును కూడా ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2026లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్లల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తుండటంతో పూర్తి నాన్ ఏసీ బోగీలతో వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టింది. నాన్ ఏసీ బోగీలైనప్పటికీ వీటిలో అత్యాధునిక సౌకర్యాలున్నాయి.

what is PNR full form on railway tickets

విశాఖ మార్గంలో టికెట్లు దొరకడం గగనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో రోజూ ప్రయాణించే రైళ్లల్లో టికెట్లు దొరకడం గగనంగా మారుతోంది. ముందుగా ప్రవేశపెట్టిన వందేభారత్ కు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండటంతో రెండో వందే భారత్ ను కూడా రైల్వే ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ-చెన్నై, విశాఖపట్నం-సికింద్రాబాద్, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో ప్రవేశపెట్టబోయే వందేభారత్ రైళ్లకు రంగులు మార్చి ప్రవేశపెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+