రోహిత ఎక్కడ..? 11 రోజులుగా కనిపించని ఆచూకీ, భర్తతో విభేదాలా..?, రంగంలోకి 5 బృందాలు...
వాళ్లిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే.. ఐటీ కంపెనీల్లో జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ భర్తతో విభేదాలతో సంసారం వీధికెక్కింది. భర్తతో ఉండలేను బాబోయ్ అని ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు బృందాలు గాలిస్తోన్న యువతి ఆచూకీ తెలియకపోవడంతో.. పేరెంట్స్, బంధువల్లో ఉత్కంఠ నెలకొంది.

మిస్సింగ్..
గత 11 రోజుల క్రితం గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత కనిపించకుండా పోయారు. ఆమెకు రోహిత్‌తో పెళ్లయ్యింది. కానీ వారి కాపురంలో కలహాలు మొదలవడంతో.. రోహిత ఇంటినుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది. రోహిత ఆపిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భర్త కూడా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో.. రోహిత అలిగి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఐదు బృందాలు
రోహిత కనిపించడం లేదని పేరంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే భర్తతో విభేదాల వల్ల రోహిత విడిగా ఉంటున్నట్టు గుర్తించారు. ఆమె ఇల్లు, కార్యాలయం, తెలిసినవారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోహిత ఆచూకీ కనుగొనేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగారు. కానీ ఆచూకీ ఇంకా తెలియడం లేదు.

సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో రోహిత ప్రత్యక్షమయ్యారు. విషయం తెలిసిన వెంటనే.. సికింద్రాబాద్, ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సికింద్రాబాద్‌లో రోహిత కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె ఎక్కడికి వచ్చారు ? ఎలా వచ్చారు ? ఎవరితో ఉన్నారు ? తదితర అంశాల ఆధారంగా ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఏం జరిగింది..?
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే నవంబర్ 28వ తేదీన దిశపై లైంగికదాడి, హత్య జరిగింది. తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్.. కేసు విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్నాళ్లకు కమిషనరేట్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇక్కడ భర్తతో విభేదాల వల్లే మహిళ వెళ్లారా ? లేదంటే కిడ్నాప్ కోణం ఉందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications