టీడీపీ నుంచి వచ్చినవారికి.. రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అటాక్.. వెంకట్ రెడ్డి ఓకే..?
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కామనే.. అలాగే పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతలపై కామెంట్లు చేయడం సహజమే. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు వేదిక. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు వల్లే గాంధీ భవన్‌కు వెళ్లడం లేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుందని కామెంట్ చేశారు. ఇదీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది.

ఉద్యమంతో సంబంధం లేదు..
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తిని నిలబెడితే.. క్రెడిబులిటీ ఉండదని కామెంట్ చేశారు. నిజాయితీ పరులు, ఉద్యమంలో కొట్లాడిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలను నిలబెట్టగలిగే నాయకుడు లేరని... ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సజెస్ట్ చేశారు. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా కొట్లాడారో, ఇప్పుడు టీఆర్ఎస్‌పై పోరాడాలన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తనకు కోపం లేదని.. అలాగని అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదన్నారు. తన బాధంతా తెలంగాణ కోసం కష్టపడిన వారికి పదవీ ఇస్తే మరింత ఉపయోగం ఉండేదన్నారు.

వారిని నియమించడం..
తెలంగాణ ఇచ్చాక తొలి పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రివర్గంలో పని చేసిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడం వల్లే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రజలు అనుకున్నా.. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంటుంది. అంతర్గత విబేధాలు, గ్రూప్ పాలిటిక్స్‌లతో పార్టీ మరింత కష్టాల్లో పడుతోందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం అనంతరం నేతల మధ్య విభేదాలు బయట పడుతున్నాయి.

వెంకట్ రెడ్డి ఓకే.. కానీ
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిన్న ధృవాలుగా పేరుంది. రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి తర్వాత చల్లబడ్డారు. స్వయంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవలే కలిశారు. దీంతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.












Click it and Unblock the Notifications