చర్యలు తప్పవ్ : పాలనలో ప్రక్షాళన : కష్టపడిన వారికే మంత్రి పదవులు..!
Recommended Video

తెలంగాణ లో కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన మంత్రివర్గ కూర్పు పై ముఖ్యమంత్రి కేసీర్ కీలక సంకేతాలు ఇచ్చా రు. ఈ సారి పాలన - మంత్రివర్గ ఏర్పాటు పూర్తి విభిన్నంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంతో కొంత మంది పై వేటు తప్పదని..కష్టపడిన వారికే మంత్రి పదవులు అని తేల్చి చెప్పారు..

రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామ ని
ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇక..మంత్రివర్గ కూర్పు పై దృష్టి పెట్టారు. తన ఆలోచనల పై ముందగానే ఆశావాహులకు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామ ని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా చెబుతున్నారు.అందుకనుగుణంగా కొత్త మంత్రివర్గం కూర్పు ఉంటుందన్నారు.

ఖమ్మం జిల్లాలో
పార్టీకి నష్టం కలిగించిన వారిపై వేటుకు వెనుకాడబోమని, కొందరు ఛైర్మన్లకు ఉద్వాసన ఉంటుందని చెబుతున్నారు. వంద సీట్లకు పైగా గెలుస్తామని భావించామని..అయితే, ఖమ్మం జిల్లాలో ఓటమి బాధ కలిగించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీకి నష్టం చేసిన వారి పై చర్యలు తప్పవంటున్న కేసీఆర్.. మంత్రివర్గం కూర్పు పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

కొందరు మంత్రులకు నో చాన్స్..
ఖమ్మం జిల్లా ఫలితాల పై సీయం ఆగ్రహం ఇంకా తగ్గలేదు. ఖమ్మంలో ఈసారి మెజారిటీ స్థానాలు వస్తాయనుకున్నాం. ఇక్కడ ఇద్దరు నేతలు ఒకరినొకరు ఓడించాలనుకున్నారు. వారిద్దరి మధ్య గొడవలెలా ఉన్నా... ప్రభుత్వ పనితీరును చూసైనా ప్రజలు గెలిపిస్తారని అనుకున్నాం. అది జరగలేదు. రాష్ట్రంలోని కొన్ని ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి వే జరిగాయి. కొంతమంది ఛైర్మన్లు ఎన్నికల్లో సరిగా పనిచేయలేదు.

మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదు
కార్యాలయాల్లో ఖాళీగా ఉంటున్న వారు కొందరు న్నారు. వారందరినీ ఇంటికి పంపుతాం. కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయి. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదు. అధికారులు, సిబ్బంది అలసత్వాన్ని సహించేది లేదని కేసీఆర్ పార్టీ ముఖ్యుల సమావేశంలో తేల్చి చెప్పారు. దీంతో.. ఈ సారి గతంలో మంత్రులుగా వ్యవహరించిన వారిలో చాలా మందికి తిరిగి క్యాబినెట్ బెర్త్ దక్కటం కష్టంగానే కనిపిస్తోంది. పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన వారికే అవకాశం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి..












Click it and Unblock the Notifications