blouse తీసిన ప్రాణం.. సరిగా కుట్టలేదనడంతో విప్పేసిన భర్త, బెడ్‌రూంలోకి వెళ్లిన భార్య.. ఇలా..
ఆలుమగలు అంటే అన్యోన్యత.. అర్థం చేసుకోవడం.. కోపాలు, తాపాలు కామనే.. కానీ చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కాలమో, వాతావరణమో.. లేదంటే సిటీ కల్చరో తెలియడం లేదు.. కానీ.. చిన్న చిన్న విషయాలకు అలకలు.. అపార్థలు పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నారు. అలా తన జీవితాన్ని చాలిస్తున్నారు. విశ్వనగరి భాగ్యనగరంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాస్త ఆలస్యంగా తెలిసింది.

ఎక్స్‌ట్రీమ్ స్టెప్..
ఓ వివాహిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. భర్తపై అలిగి.. తన ప్రాణాన్ని తీసుకుంది. ఇద్దరు పిల్లలను తల్లి లేని వారిని చేసింది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గోల్నాక తిరుమలనగర్‌లో పిల్లలతో కలిసి లైఫ్ లీడ్ చేస్తున్నారు. బైక్‌పై తిరుగుతూ చీరలను అమ్ముతాడు. అలాగే టైలరింగ్ కూడా చేస్తాడు. శనివారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా.. శ్రీనివాస్ భార్యకు జాకెట్ కుట్టి ఇచ్చాడు. అది ఆమెకు నచ్చలేదు. ఇదే గొడవకు మూల కారణం.

జాకెట్ కుట్టు విప్పీ..
అతను తాను కుట్టిన జాకెట్ కుట్లు విప్పేశాడు. నీకు నచ్చినట్టు కుట్టుకోవాలని ఇచ్చాడు. దీంతో భర్తపై అలిగి ఇంట్లో గల బెడ్‌రూంలోకి వెళ్లి గడియపెట్టుకుంది. భర్త ఎంత పిలిచినా తలుపు తీయలేదు. దీంతో అలిగిందని అతను అనుకున్నాడు. కానీ ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. మధ్యాహ్నం పిల్లలు వచ్చి పిలిచినా తలుపుతీయలేదు. దీంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. తలుపులు పగుల గొట్టి చూడగా ఉరేసుకుని కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు అంబర్‌పేట ఎస్‌ఐ మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

విషాద వదనం
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో విజయలక్ష్మి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్లౌజ్ విషయంలో ఆమె ఇలా ఎందుకు చేసిందనే అంశం అర్థం కావడం లేదు. ఆమె ప్రాణాలు తీసుకొని.. పిల్లలను మాత్రం తల్లిలేని వారిని చేసింది. అయితే భర్తతో మరేమైనా గొడవలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications