నగ్న వీడియోలు.. పోస్ట్ చేస్తానని వేధింపులు... ఎక్కడంటే

సోషల్ మీడియాలో పరిచయం.. ప్రేమ, కామ వాంఛలు తీర్చుకునే వేదిక అవుతుంది. కొందరు చాట్ చేయడం.. వీడియో కాల్ మాట్లాడటం చేస్తున్నారు. అయితే కొందరు తొందరపడి.. నగ్నంగా కాల్ మాట్లాడుతున్నారు. దానిని రికార్డ్ చేయడం కాస్త ఇబ్బందికి గురిచేసోంది. ఆ సమయంలో వారు చూసుకోరు.. చూసుకున్నాక జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అవును నిజమే హైదరాబాద్‌లో జరిగిన మరో ఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఫేస్‌బుక్‌‌లో చాలా మంది కలుస్తుంటారు. అ పరిచయం కాస్త డీప్‌నకు గురిచేస్తోంది. రోడ్‌ నెం.12లోని భోలానగర్‌లో నివసించే ఓ వ్యక్తి ఎల్రక్టీషియన్‌గా పని చేస్తున్నాడు. జూలైలో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతి పరిచయం అయ్యింది. ఇద్దరు స్నేహితులుగా మారారు. తర్వాత వాట్సాప్‌ చాటింగ్‌ కూడా చేసుకున్నారు. ఇంకా ఏముంది.. వారి స్నేహం కాస్త మరింత ముదిరింది. ఇక నగ్నంగా కాల్స్ మాట్లాడుకోవడం ప్రారంభించారు.

woman harassed man over indecent videos

తొలుత యువతి తన నగ్న వీడియోలు చూపించింది. ఆడదే చూపించింది కదా ఏమో అనుకున్నాడో కానీ అతను కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పడంతో అలాగే చేశాడు. కాసేపటి తర్వాత ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెడుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ వీడియోను కొంత మందికి పంపించింది. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటానని భయభ్రాంతుల కు గురిచేస్తూ వస్తోంది. దీంతో ఆ వ్యక్తికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. తన జీవితం ఇలా అయ్యింది భగవంతుడా అని తల పట్టుకున్నారు.

సదరు యువతి చాటింగ్‌లో తన నగ్న వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతోందని బాధితుడు ఒకరు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ యువతి గురించి ఆరా తీస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళలతో చాట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. లేదంటే ఈ విధంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. సో బీ అలర్ట్.. అబ్బాయిలు.. కొందరు అమ్మాయిలు ఛీట్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+